Newsయాంకర్ సుమ కోసం అలాంటి పని చేయబోతున్న చిరంజీవి.. ఎంత పెద్ద...

యాంకర్ సుమ కోసం అలాంటి పని చేయబోతున్న చిరంజీవి.. ఎంత పెద్ద మనసో..!

బుల్లితెరపై టాప్ యాంకర్ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉన్న యాంకర్ సుమ .. ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికే టాప్ యాంకర్ గానే ఉండిపోయింది . అయితే ఇప్పుడు ఆమె వారసత్వాన్ని ఆయన కొడుకు ముందుకు తీసుకెళ్లబోతున్నాడు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం కాబోతున్నాడు సుమ కొడుకు రోషన్ .

బబుల్గం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు సుమ కొడుకు రోషన్ . క్షణం , కృష్ణ అండ్ హిస్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్ తెరకెక్కించిన ఈ సినిమా లో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. కాగా బబుల్గం సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావడానికి సిద్ధపడుతుంది .

ఇలాంటి క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా సుమ కూడా తన కొడుకుకు హెల్ప్ చేస్తుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తన కొడుకు చేస్తున్న బబుల్గం సినిమా కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రమోషన్స్ కి వాడుకుంటుందట. బబుల్గం సెకండ్ సింగిల్ ఇజ్జత్ పాట కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారు . ఈ పాటను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయబోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news