Newsత‌మిళ‌నాడు అసెంబ్లీలో సావిత్రి ఫొటో..కడుపు రగిలిపోయిన జయలలిత ఏం చేసిందో తెలుసా..?

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సావిత్రి ఫొటో..కడుపు రగిలిపోయిన జయలలిత ఏం చేసిందో తెలుసా..?

అది జ‌య‌ల‌లిత తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన సంద‌ర్భం. అన్నా డీఎంకే వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ హీరో ఎంజీఆర్ కు ఘ‌న నివాళి అర్పించిన పార్టీ అధినేత‌లు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఎంజీఆర్ చిత్ర‌ప‌టాన్ని పెట్టాల‌ని సూచించారు. అయితే.. వాస్త‌వానికి ఆయ‌న మాజీ సీఎం కూడా కావ‌డంతో ఇది స‌బ‌బేన‌ని అంద‌రూ అన్నారు.

కానీ, ఇంత‌లో మాజీ సీఎంల విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌నిచేసిన వారి ఫొటోలు కూడా అసెంబ్లీ ఆవ‌ర‌న‌లో పెట్టాల్సి ఉంటుంద‌ని, కాబ‌ట్టి మాజీ సీఎం హోదాలో కాదు.. రాష్ట్ర త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన సేవ‌కు గుర్తుగా ఆయ‌న ఫొటోను పెట్టాల‌ని మ‌రో తీర్మానం తెర‌మీదికివ‌చ్చింది. దీనికి జ‌య‌ల‌లిత కూడా ఓకేచెప్పారు. ఇక‌, ఈ విష‌యం తెలిసిన డీఎంకే అప్ప‌టి మ‌హాన‌టి సావిత్రి ఫొటోను కూడా పెట్టాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.

సినిమా తార‌ల ఫొటోలు అసెంబ్లీలో పెట్టే కొత్త సంప్ర‌దాయానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఇది నిజ‌మైన సంప్ర‌దాయ‌మే అయితే.. వివ‌క్ష‌, ప‌క్ష‌పాతం లేక‌పోతే.. ఎంజీఆర్ ఫొటోతో పాటు.. సావిత్ర‌మ్మ ఫొటో కూడా పెట్టాల్సిందే అని అప్ప‌టి డీఎంకే అధినేత‌, మాజీ సీఎం కరుణానిధి నిప్పులు చెరిగారు. ఎందుకంటే.. సావిత్ర‌మ్మ ఫొటో పెట్టేందుకు సీఎంగా జ‌య‌ల‌లిత ఎలానూ ఒప్పుకోదు. ఈ విష‌యం ఆయ‌న‌కు తెలుసు. సో.. ఈ వ్యూహంతో నాడు ఫొటోలు పెట్టే సంస్కృతిని అడ్డుకున్నారు.

ఇక‌, క‌రుణానిధి వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టిన జ‌య‌ల‌లిత‌.. ఇది సాధ్యం కాద‌ని.. అసెంబ్లీలో దేశాధినేతల ఫొటోలు మాత్ర‌మే ఉండాల‌ని తీర్మానం చేసి.. దానినే అమ‌లు చేశారు. మొత్తానికి క‌రుణానిధి ప్లే చేసిన సావిత్రి ఫొటో వ్య‌వ‌హారం.. కోలీవుడ్‌ను సైతం కుదిపేసింది. దీనిని స‌మ‌ర్ధిస్తూ.. ఒకవ‌ర్గం.. వ్య‌తిరేకిస్తూ.. మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేశాయి. ఎట్ట‌కేల‌కు అస‌లుఫొటోలే పెట్టొద్ద‌ని నిర్ణ‌యించ‌డంతో వివాదం స‌ర్దుబ‌ణిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news