మహమ్మద్ సిరాజ్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు మారుమ్రోగిపోతుంది . రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ ఎంతలా ఇండియా టీం ఫైనల్స్ కి చేరుకోవడానికి సహాయపడ్డారు మనం చూసాం. పలు మ్యాచుల్లో ఈయన తీసిన వికెట్లే కీలకంగా మారాయి. ఫైనల్ లో ఆయన పర్ఫామెన్స్ అంత ఆశాజనికంగా లేకపోయినా సరే అంతకుముందు గెలిచిన మ్యాచ్లో మాత్రం మహమ్మద్ సిరాజ్ పాత్ర ఎంతైనా ఉంది అని చెప్పుకోవాలి.
కాగా ఎవరు ఊహించిన విధంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘోర ఓటమిపాలు అవ్వడం ఇప్పటికి ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు . మన కప్పును ఆస్ట్రేలియా ఎత్తుకుపోయింది అంటూ బాధపడిపోతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి .
హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నాడట . డిసెంబర్ ఆఖరి వారంలో నిశ్చితార్థం మార్చి ఆఖరిలో పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తుంది . ఈ పెళ్లి వేడుకకు టీమిండియా క్రికెటర్స్ అందరూ కూడా హాజరు కాబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!