Newsబాల‌య్య ప‌క్క‌న ఆ ఇద్ద‌రు హీరోయిన్లు.... ఇది మామూలు ట్విస్ట్ కాదుగా...!

బాల‌య్య ప‌క్క‌న ఆ ఇద్ద‌రు హీరోయిన్లు…. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా…!

నందమూరి బాలకృష్ణ ఈ యాడాది ఇప్పటికే సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్‌ కేసరి సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ – దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాబీ బాలకృష్ణ కాంబినేషన్లో ఇది తొలి సినిమా. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఈ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్లపై సరికొత్త రూమర్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రభినయం చేస్తున్నారు. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ముందుగా మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపించింది. అయితే ఇప్పుడు తమన్నాను పక్కన పెట్టేసి సీనియర్ హీరోయిన్ త్రిషతో పాటు గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఏది ఏమైనా బాలయ్య బాబు, మీనాక్షి చౌదరి, త్రిష కాంబినేషన్ అంటే వినటానికి అదిరిపోతుంది. రేపు తెరమీద ఈ కాంబినేషన్లో చూస్తుంటే గూస్‌బంస్ మోత మోగిపోవాల్సిందే. గతంలో బాలయ్య – త్రిష కాంబినేషన్లో లయన్ సినిమా వచ్చింది. ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత మరోసారి బాలయ్య – త్రిష జోడి కట్టబోతున్నారు.

ప్రస్తుతం త్రిష మంచి ఫామ్ లో ఉంది. తాజాగా లియో సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు వెంటనే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు తిరుగే ఉండదు. ఇక ఈ సినిమా బాలయ్య టైపు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ నేపథ్యం కూడా ఉంటుందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news