నటసమ్రాట్‌గా పేరు పొందిన అక్కినేని నాగేశ్వరరావు.. సుమారు 450 సినిమాల్లో నటించారు. తొలి నాళ్లలో చిన్న చిన్న పాత్రలు వేసిన ఆయనకు మిస్సమ్మ మేలి మలుపుగా మారింది. ఇక, తర్వాత.. వచ్చిన సినిమా ల్లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఆమె మెరిసిపోయారు. అయితే.. ఇండస్ట్రీపై పట్టు సాధించాక.. అన్నగారు ఎన్టీఆర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. నిర్మాతగా కూడా సినిమాలు తీశారు. ఇలానే అక్కినేని చాలా రోజుల తర్వాత.. ఇండస్ట్రీలోని కొన్ని రంగాల్లోకి వచ్చారు.
అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. నిర్మాతగా మారారు. కానీ, ఆయన ఎప్పుడూ దర్శకత్వ బాధ్యతలు తీసుకోలేదు. ఏ సినిమాను కూడా ఆయన తన సొంత దర్శకత్వంలో చేయలేదు. దర్శకుడు యువకుడు అయినా.. అనుభవంలేని కొత్త వారైనా ఆయన వారు చెప్పినట్టు నటించారే తప్ప.. ఎక్కడా తన సీనియార్టీని ప్రదర్శించి అజమాయిషీ చేయలేదు. ఇక, తను సొంతగా అన్నపూర్ణ బ్యానర్‌పై సినిమాలు తీసారే తప్ప.. తను దర్శకత్వం చేయలేదు.
దీనికి కారణం.. బాధ్యతలు ఎక్కువ అని అక్కినేని అనేవారు. అంతేకాదు.. దర్శకుడు అంటే.. అందరినీ కలుపుకొని పోవాలి. సంగీతం, సాహిత్యంపైనా.. పట్టు ఉండాలని అక్కినేని నమ్మేవారు. ఇక, మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలు తీసే ప్రతిభ ఉండాలని గట్టిగా చెప్పేవారు. ఇవన్నీ.. తనకు లేవని.. అందుకే దర్శకత్వానికి దూరంగా ఉన్నానని.. ఆయన నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. అయితే.. నిర్మాతగా మాత్రం తాను సక్సెస్ అయ్యాయని.. దర్శకత్వం జోలికి వెళ్లకపోవడంతోనే ఇది సాధ్యమైందని ఆయన చెప్పడం గమనార్హం.