ఈ మధ్య హీరోయిన్స్ మార్ఫింగ్ వీడియోస్ సోషల్ మిడియాలో వచ్చి పెద్ద దుమారం రేపుతున్నాయి. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వచ్చి అటు ఇండస్ట్రీలో ఇటు జనాలలో పెద్ద చర్చలు జరిగాయి. రష్మిక ఫేక్ వీడియో చూసి అమితాబ్ బచ్చన్ నుంచి విజయ్ దేవరకొండ వరకూ చాలామంది స్పందించారు. ఇలాంటి వీడియోస్ చేస్తున్నవారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని అంటూ సలహాలిస్తున్నారు.
వాస్తవానికి ఇలా జరగడం ఇదే మొదటిసరా..? అంటే కానేకాదు. 10 ఏళ్ళ నుంచే ..ఇంకా చెపాలంటే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే జరుగుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ డీప్ ఫేక్ వీడియో గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ, ఎన్నో ఏళ్ళ క్రితమే కాజోల్ కి సంబంధించిన ఫేక్ వీడియోస్, ఫొటోస్ సర్చ్ చేస్తే నెట్టింట చాలా దొరుకుతాయి.
ఒక్క కాజోల్ వీడియోస్ మాత్రమే కాదు, కత్రినా కైఫ్, మనీషా కోయిరాల, ఊర్మిళ, కరీనా కపూర్, కరిష్మా కపూర్..తెలుగులో అనుష్క శెట్టి, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ, త్రిష, హన్షిక, రోజా..ఇలా చెప్పుకుంటూపోతే ఫాంలో ఉన్న ప్రతీ హీరోయిన్ కి సమబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు నెట్టింట దర్శనమిస్తాయి. ఇలాంటి వాటి గురించి పట్టించుకోకపోవడమే అన్నిటికీ ఉత్తమం అని కొందరు సలహాలిస్తున్నారు.
ఎందుకంటే దేశం నలుమూలలా ఎవడో ఒకడు ఇలాంటివి రీక్రియేట్ చేస్తూనే ఉంటాడు. ఆర్జీవీ లాంటి మేధావులు చెప్పే లాజిక్ ఒకటే. డీప్ ఫేక్ వీడియో వల్ల పాపులారిటీ వస్తుంది..దాన్ని పక్కన పెట్టి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం పనులు ఆపుకొని అని. నిజమే ఆయన అలా అనకపోయినా..దీని గురించి ప్రస్తావన వస్తే మాత్రం ఇలాగే స్పందించవచ్చు. ఒకరకంగా ఇలాంటి ఫొటో గానీ, వీడియో గానీ బయటకి వస్తే జనాలు గూగుల్ సర్చింగ్ వల్ల ఇంకాస్త పాపులారిటీ వచ్చేస్తుంది. అదే లాజిక్ అందరూ ఆలోచిస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు.