కాస్టింగ్ కౌచ్ విప్లవం రేపిన శ్రీరెడ్డి దాని గురించి ఎవరు తీసుకోలేని నిర్ణయాలను తీసుకుంది. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వల్ల కాస్త మ్యాటర్ డైవర్ట్ అయ్యింది. అయినా సరే మా అసోషియేషన్ తో పాటుగా అన్ని సంఘాలు దీనికి తగిన ప్రతి చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకమైన టీం ను ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.
ఇకపోతే టివి ఛానెల్స్ ఇలాంటి వాటి మీద డిస్కషన్ పెట్టి హడావిడి చేయొద్దని చెప్పారు. అందుకే రెండు వారాలుగా శ్రీరెడ్డిని డిస్కషన్స్ ను పిలిచిన వారు కరువయ్యారు. అయితే తనకు తెలిసిన సోషల్ మాధ్యమాల ద్వారానే శ్రీరెడ్డి మళ్లీ హడావిడి మొదలు పెట్టింది. లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.
కాస్కోరా నాని.. నీ టికెట్ వచ్చింది అంటూ శ్రీరెడ్డి ట్వీట్ సంచలనంగా మారింది. తెర మీద శ్రీరంగ నీతులు చెప్పే నాచురల్ స్టార్ ఓ అమ్మాయికి రోజంతా నరకం చూపించాడని చెప్పుకొచ్చింది. అయితే వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని మీద ఇలాంటి కామెంట్స్ రావడం ఆశ్చర్యకరంగానే ఉంది. సడెన్ గా టాపిక్ నాని మీద డైవర్ట్ అవడాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు. మరి ఈ మ్యాటర్ పై నాని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.