Gossipsనందమూరి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ ?

నందమూరి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ ?

కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ ఇద్దరు నందమూరి ఫ్యాన్స్ ముచ్చటపడేలా అన్నదమ్ముల అనుబంధంతో ఉంటారు. అన్నకి తమ్ముడు తమ్ముడికి అన్న ఎప్పుడు సపోర్ట్ గా నిలిచేలా ఉన్న పరిస్థితులు కాస్త ఇప్పుడు మారిపోయాయని అంటున్నారు. కళ్యాణ్ రాం నా నువ్వే ఆడియోలో ఈవెంట్ ఎన్.టి.ఆర్ లేకుండానే నడిచింది. ఇదే కాదు మొన్నామధ్య జరిగిన ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్.టి.ఆర్ కనబడలేదు.

కళ్యాణ్ రాం సినిమాకు సంబందించి ఎలాంటి ఈవెంట్ అయినా సరే అటెండ్ అయ్యే ఎన్.టి.ఆర్ ఎందుకు దూరమవుతున్నాడా అని అందరు ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ కు ఆహ్వానం అందుకున్నాడు కళ్యాణ్ రాం బాబాయ్ పిలిచాడు కాబట్టి వెళ్లక తప్పలేదు. అయితే జూనియర్ కు మాత్రం ఎలాంటి ఇన్విటేషన్ అందలేదు.

ఈ వ్యవహారమే కాదు మహానటిలో ఎన్.టి.ఆర్ రోల్ కు జూనియర్ చేయనని అడిగినా కాదనేశాడు. ఈ బయోపిక్ లే వీరి మధ్య దూరం చేశాయని టాక్. మరో పక్క జై లవ కుశ సినిమా నిర్మాణంలో అన్నదమ్ముల మధ్య డిస్టబన్సెస్ వచ్చాయని టాక్. మొత్తంగా కలిసి ఉండే ఈ అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందని అంటున్నారు మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news