Newsనంద‌మూరి హీరోల పాలిట ఐరెన్‌లెగ్‌లుగా మారిన మెగా హీరోయిన్లు...!

నంద‌మూరి హీరోల పాలిట ఐరెన్‌లెగ్‌లుగా మారిన మెగా హీరోయిన్లు…!

నిమా ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్లను రిపీట్ చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తే ఆ ఇద్దరు హీరోయిన్లను మరో సినిమాలో రిపీట్ చేయడం మాత్రం అరుదుగా జరుగుతుంది. మెగా హీరోల హీరోయిన్లను రిపీట్ చేసిన సమయంలో నందమూరి హీరోలకు షాకులు తగిలాయి. ప్రధానంగా రెండు సందర్భాల్లో మెగా హీరోలకు సక్సెస్ ఇచ్చిన హీరోయిన్లు నందమూరి హీరోలకు మాత్రం షాకిచ్చారు.

చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంద్ర మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో సోనాలి బింద్రే పాజిటివ్ రోల్ లో కనిపించగా ఆర్తి అగర్వాల్ ఒకింత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. ఇంద్ర సృష్టించిన సంచలన రికార్డులు మెగా ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. అయితే బాలయ్య బి.గోపాల్ కాంబోలో తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో సైతం ఈ హీరోయిన్లను రిపీట్ చేయడం జరిగింది.

పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో ఆర్తి అగర్వాల్ పాజిటివ్ రోల్ లో కనిపించగా సోనాలి బింద్రే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. పోసాని కృష్ణమురళి ఈ సినిమాకు కథ అందించారు. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలోని కొన్ని సీన్లపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. 2002 సంవత్సరంలో ఇంద్ర రిలీజ్ కాగా 2003 సంవత్సరంలో పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగా హీరోలకు హిట్లు ఇచ్చిన హీరోయిన్లు బాలయ్యకు మాత్రం షాకిచ్చారు.

2013 సంవత్సరంలో అత్తారింటికి దారేది రిలీజ్ కాగా పవన్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందే ఫస్టాఫ్ లీకైనా ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అయితే రభస మూవీలో కూడా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించినా ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ కు ఈ సినిమాతో భారీ షాక్ తగిలింది. సంతోష్ శ్రీనివాస్ రభస సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా హీరోల హీరోయిన్లను రిపీట్ చేసిన నందమూరి హీరోలకు బాగానే దెబ్బలు తగిలాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news