టాలీవుడ్ క్రేజీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి అందాల నటి లావణ్య త్రిపాఠి ఆరేళ్లపాటు ప్రేమించుకుని ఎట్టకేలకు ఇటీవల పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు. రీసెంట్గా ఇటలీలో ఎంతో వైభవంగా వీరిద్దరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీ ద్వారా చిగురించిన వీరి ప్రేమ ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో మరింత బలపడింది.
ఆరేళ్ల పాటు వీరు ఎంతో గప్‌చుప్‌గా ప్రేమించుకున్నారు. అసలు యేడాది క్రిందట వరకు కూడా వీరు ప్రేమలో ఉన్నారన్న విషయం ఇంట్లో వాళ్లకే తెలియదు. అంత సీక్రెట్‌గా వీరు ప్రేమలో మునిగి తేలారు.
ఆ తర్వాత వీరిద్దరూ ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగిన వారం రోజులకే తొలి పండగగా దీపావళి వచ్చింది. వీరు దీపావళిని చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా వరుణ్ – లావణ్య ఇద్దరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో దిగిన స్పెషల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే వరుణ్ ఇటీవల గాంఢీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. డిసెంబర్లో హ్యాపీ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇక లావణ్య పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ సినిమా కెరీర్ కొనసాగించే విషయంలో మంచి అండర్‌స్టాండింగ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది.