Moviesఅప్పుడు సమంత..ఇప్పుడు రష్మిక.. ఈ దొంగ ఆటలు ఏంటి అమ్మాయిలు..!

అప్పుడు సమంత..ఇప్పుడు రష్మిక.. ఈ దొంగ ఆటలు ఏంటి అమ్మాయిలు..!

కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ తెలివి తక్కువ పనులతో కొన్ని ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో అడ్డంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. అయితే కొంతమంది దీని సీరియస్ గా తీసుకుంటే మరి కొంతమంది సిల్లీగా తీసుకొని వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే రీసెంట్గా దివాళి సందర్భంగా విజయ్ దేవరకొండ తన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ను షేర్ చేశారు . ఇదే క్రమంలో రష్మిక మందన్నా కూడా దివాళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పిక్చర్ ని షేర్ చేసింది. ఈ ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలని బ్యాగ్రౌండ్ ఒకటేగా ఉండడంతో వీళ్ళిద్దరూ కలిసి నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు దివాళి అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

కేవలం ఇది కొత్త కాదు గతంలో చాలా సార్లు వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ ఇలాగే వైరల్ అయ్యాయి. అయితే వీళ్ళు మీ మధ్య ప్రేమ ఉందా ..? అంటే మాత్రం లేదు మేము ఫ్రెండ్స్ అంటున్నారు . గతంలో ఇదే మాదిరిగా నాగచైతన్య సమంతలు కూడా సోషల్ మీడియాలో అడ్డంగా బుక్ అయ్యారు. వాళ్లకు సంబంధించిన ఫోటోలు ఇదే విధంగా వైరల్ అయ్యాయి. అయితే సమంత నాగచైతన్య మాత్రం తమ ప్రేమపై చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక కూడా అలాగే ఆటలాడుతున్నారు . దీంతో ఒకప్పుడు సమంత చేసిన విధంగానే ఇప్పుడు విజయ్ – రష్మిక కూడా చేస్తున్నారు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news