శివాజీ ఇప్పుడు అలా కాదు బిగ్ బాస్ శివాజీ అంటూ పిలుస్తున్నారు. ఇలా చెప్తే టక్కని గుర్తుపట్టేస్తున్నారు. బిగ్బాస్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన బిగ్ బాస్ శివాజీ ఇప్పుడు కప్ కొట్టే స్థాయికి ఎదిగిపోయాడు . నో డౌట్ బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ శివాజీని అంటూ రాసి పెట్టుకోమని ఫాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు .
అంతటి మైండ్ గేమ్ తో ఆటలాడుతున్నాడు శివాజీ . అంతేకాదు రైతు బిడ్డ సైతం అదే స్థాయిలో కాంపిటీషన్ ఇస్తున్నారు . కచ్చితంగా ఒక రన్నర్ ఒకరు విన్నర్ అవుతారు అంటూ ఫిక్స్ అయిపోయారు ఫాన్స్ . కాగా దీవాళి సందర్భంగా బిగ్బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చే సందడి చేశారు . ఈ క్రమంలోనే బిగ్బాస్ సీజన్ లో టాప్ కంటిస్టెంట్ గా ఉన్న శివాజీ కుటుంబం నుంచి ఆయన చిన్న కొడుకు ఆయన భార్య స్టేజ్ పైకి వచ్చారు.
ఇన్నాళ్లు కెమెరాకి దూరంగా ఉన్న శివాజీ భార్య ఫస్ట్ టైం తెరపై కనిపించింది . అసలు శివాజీ భార్య ఎవరు..? ఎలా ఉంటుంది..? అనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన తన పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు పబ్లిక్ గా చెప్పింది లేదు . ఒకే ఒక్క ఇంటర్వ్యూలో మాత్రం తన పెళ్లి సీక్రెట్ ను బయట పెట్టాడు. ఓ ఫంక్షన్ లో చూసామని ఇద్దరు మాట్లాడుకున్నామని ..ఇంట్లో పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నామని సింపుల్ గా మా లవ్ స్టోరీ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా బిగ్ బాస్ శివాజీ భార్య పేరు శ్వేత చూడడానికి అచ్చం హీరోయిన్ లాగే ఉంది . కుందనపు బొమ్మ మాటలు కూడా అంతే చక్కగా మాట్లాడింది . దీంతో శివాజీ శ్వేతల లవ్ స్టోరీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!