Newsబాల‌య్య పాన్ ఇండియా స్టార్‌... బుల్లితెర‌పై ఆల్ టైం సెన్షేష‌న్ రికార్డ్‌..!

బాల‌య్య పాన్ ఇండియా స్టార్‌… బుల్లితెర‌పై ఆల్ టైం సెన్షేష‌న్ రికార్డ్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా ఈ దసరాకు వచ్చిన భగవంత్‌ కేసరి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో శ్రీలీల‌ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వరుసగా మూడో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను కూడా పట్టాలు ఎక్కించేశాడు. రీసెంట్గా బాలయ్య తాను హోస్ట్ చేసిన‌ ఓటిటి హిట్ షో అన్‌స్టాప‌బుల్‌ సీజన్ 3 కూడా మళ్లీ స్టార్ట్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

మూడో సీజన్‌లో లిమిటెడ్ ఎడిషన్ గానే నిర్వహించనున్నారు. ఈ సీజ‌న్లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ ఎపిసోడ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఈ షో కి బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తన యానిమల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రానున్నాడు. ఈ ఎపిసోడ్‌లో హీరోయిన్ రష్మిక మందన్న తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా వస్తున్నాడు. బాలయ్యతో ఈ ముగ్గురు కలిపి చేసే షో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది.

ఏది ఏమైనా ఇప్పటివరకు తన షో తో కేవలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను రంజింపచేస్తున్న బాలయ్య.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో వెండితెర బుల్లితెర అభిమానులను మెస్మరైజ్ చేయనున్నాడు. టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా ఫాన్ ఇండియా స్టార్ హీరోతో టాక్‌షో చేసిన రికార్డు లేదు. బాలయ్య ఏకంగా రణబీర్ కపూర్‌ను టాక్‌షో లోకి రప్పించి హోస్ట్ చేయబోతున్నాడు. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news