Newsఒకే టైటిల్‌తో వ‌చ్చిన బాల‌య్య - శ్రీకాంత్ సినిమాలు తెలుసా...!

ఒకే టైటిల్‌తో వ‌చ్చిన బాల‌య్య – శ్రీకాంత్ సినిమాలు తెలుసా…!

టాలీవుడ్‌లో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఇటీవల కాలంలో కామన్‌గా మారింది. ఏడు దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో గతంలో కొందరు హీరోలు నటించిన సినిమా టైటిల్స్‌ను ఇప్పుడు మళ్లీ పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాల టైటిల్స్ ను ఆయన తనయుడు బాలకృష్ణ పెట్టుకుని మళ్ళీ సినిమాలు చేశారు. ఇక ఇతర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకు కూడా గతంలో ఉన్న తెలుగు సినిమాల టైటిల్స్‌ను వాడేస్తున్నారు.

ఖైదీ లాంటి హిట్ మూవీ టైటిల్స్‌ను మళ్లీ వాడి సూపర్ హిట్లు కొడుతున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ, మరో సీనియర్ హీరో శ్రీకాంత్ ఇద్దరు కలిసి ఒకే టైటిల్‌తో సినిమాలు చేశారు. బాలకృష్ణ – రాధా జంటగా.. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1988లో యాక్షన్ సినిమాగా తెరకెక్కింది దొంగ రాముడు. గోపి పిక్చర్స్ పతకంపై చ‌ల‌సాని గోపి ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, శారద రావు, గోపాలరావు తదితరులు నటించారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2003లో విభిన్న చిత్రాల దర్శకుడు వంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా దొంగరాముడు అండ్ పార్టీ సినిమా తెరకెక్కింది. బాలయ్య టైటిల్ కు పార్టీ అన్న పదం అదనంగా యాడ్ చేసి శ్రీకాంత్ ఈ సినిమాలో నటించారు. శ్రీకాంత్ – లయ జంటగా నటించిన ఈ సినిమాకు చక్రి మ్యూజిక్ అందించారు.

2023 జూన్ 26న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక చిన్న దొంగగా నటించాడు. ఈ క్రమంలోనే జర్నలిస్టు వసంత లక్ష్మి (లయ)తో ప్రేమలో పడతాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా అలరించలేదు. అలా శ్రీకాంత్.. బాలయ్య దొంగ రాముడు టైటిల్స్ వాడుకుని సినిమాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news