Newsకృష్ణ - విజయనిర్మల పెళ్ళి చేసింది చంద్రమోహన్ ... మహేష్ -...

కృష్ణ – విజయనిర్మల పెళ్ళి చేసింది చంద్రమోహన్ … మహేష్ – నమ్రత ప్రేమలో మీడియేటర్ ఎవరో తెలుసా..?

దివంగత దంపతులు సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల తిరుపతి వెంకన్న సాక్షిగా అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటికే విజయనిర్మలకు మరో వ్యక్తితో పెళ్లి జరిగి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మనస్పర్ధల నేపథ్యంలో ఆమె భర్తతో విడాకులు తీసుకుని మానసికంగా కృష్ణకు దగ్గరయ్యారు. అప్పటికే కృష్ణకు మరదలు ఇందిరా దేవితో పెళ్లి జరిగింది. ఈ జంట‌కు పిల్లలు కూడా ఉన్నారు. తాను విజయనిర్మలను పెళ్లి చేసుకుంటున్న విషయం కృష్ణ ముందుగా తనకు అత్యంత సన్నిహితుడు అయిన చంద్రమోహన్‌కు చెప్పారు.

తిరుపతిలో కొద్దిమంది సన్నిహితులు సమక్షంలో జరిగిన ఈ పెళ్ళికి చంద్రమోహన్ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. విజయనిర్మల చనిపోయేంతవరకు కూడా చంద్రమోహన్‌ను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకునేవారు. అలా కృష్ణ – విజయనిర్మల పెళ్లికి తాజాగా దివంగతులు అయిన చంద్రమోహన్ పెళ్లి పెద్దగా ఉంటే.. కృష్ణ తనయుడు మహేష్ బాబు, మాజీ మిస్ ఇండియా నమ్ర‌త శిరోద్క‌ర్‌ పెళ్లికి కూడా ఒకరు పెద్దగా వ్యవహరించారు.

వీరిద్దరి ప్రేమకు ఆ వ్యక్తి మీడియేటర్‌గా ఉన్నారు. ఆమె ఎవరో కాదు మహేష్ బాబు సోదరి మంజుల. నమ్రత – మహేష్ బాబు కంటే వయసులో నాలుగేళ్లు పెద్ద. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగ్ టైంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2005 ఫిబ్రవరి 10 మహేష్ మూడుముళ్ల బంధం లో అడుగు పెట్టారు.

తెలుగు సాంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి జరగటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. వెంట‌నే మ‌హేష్ త‌న ప్రేమ విష‌యాన్ని మంజుల‌కు చెప్పాడు. మంజుల కీరోల్‌ ప్లే చేసి ఆమె దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి తన సోదరుడు వివాహాన్ని జరిపించింది. అందుకే మంజుల అంటే మహేష్ దంపతులకు ఎంతో ఇష్టం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news