టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో అటు తన ఫ్యామిలీకి కూడా అంతే టైం కేటాయిస్తూ ఉంటాడు. ఎంత సూపర్ స్టార్ అయినా సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా.. కూడా తన ఫ్యామిలీకి టైం కేటాయించే విషయంలో మహేష్ అసలు నిర్లక్ష్యం చేయడు. మహేష్ తన భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మహేష్ చిన్నప్పుడే బాలనటుడుగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.
తన అన్నతో పాటు తండ్రితో కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం సినిమాలు బాలనటుడిగా మహేష్‌ను ఎంతోమంది అభిమానులకు దగ్గర చేశాయి. మహేష్ చదువుకుంటూనే స్కూల్‌కు హాలీడేస్ వస్తే షూటింగ్స్ లో పాల్గొనేవాడు. అలా చిన్నప్పుడే చాలా సినిమాలలో నటించాడు. ఎప్పుడైతే సినిమాలలో నటించటం మొదలుపెట్టాడో అప్పటినుంచి స్కూలుకు వెళ్లడం తగ్గించేశాడు.
స్కూల్లో కూడా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు కావడంతో ఉపాధ్యాయులు కూడా మహేష్‌ను గారాబం చేసేవారు. మార్కులు తక్కువ వచ్చినా ఏమీ అనేవారు కాదు. అయితే గారాబం పెరగడంతో మహేష్ కు చదువు సరిగ్గా అబ్బలేదు. పదో తరగతిలో కూడా అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు.
సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందో అన్న భయంతో ఇకపై సినిమాలు వద్దని బుద్ధిగా చదువుకోవాలని మహేష్ కు తండ్రి చెప్పడంతో.. మళ్ళీ చదువుపై ఫోకస్ పెట్టాడు. అయినా పదో తరగతిలో అనుకున్న మార్పులు రాలేదు.
దీంతో తనకెంతో ఇష్టమైన లయోలా కాలేజీలో ఇంటర్ చదివేందుకు మహేష్‌కు అడ్మిషన్ కూడా రాలేదు. కనీసం డిగ్రీలో అయిన అక్కడ సీటు సంపాదించాలని ఇంటర్లో కష్టపడి చదివాడు. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో తాను అనుకున్నట్టుగానే లయోలా డిగ్రీ కాలేజీలో బీకాం సీటు సాధించాడు. అక్కడ చదువుతున్న టైంలో మళ్లీ మనసు సినిమాల వైపు లాగడంతో కొంత కాలం పాటు శిక్షణ తీసుకుని ఆ తర్వాత వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.