టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సీనియర్ నటుడు చంద్రమోహన్ (79) ఈరోజు మృతి చెందారు. గత కొంతకాలంగా షుగర్ తో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఇక కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు.
ఆయన ముందుగా క్యాషియర్‌గా పనిచేసేవారు. ఆయన తన ఉద్యోగాన్ని ఏలూరులో కొనసాగించారు. సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లిన ఆయన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత హీరోగా మారాక ఆయన అస్సలు వెనుతిరిగి చూసుకోలేదు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరు దివంగత స్టార్ హీరోలు అయినా సూపర్ స్టార్ కృష్ణ, మరో దివంగత సీనియర్ నటులు శోభన్ బాబు ఆయనకు అత్యంత సన్నిహితులు. అప్పట్లో శోభన్‌బాబు ఏదైనా భూమి కొనాలంటే ముందుగా చంద్రమోహన్‌ను రు. 100 అడిగేవాటర. అది వాళ్లిద్దరి మధ్య అనుబంధం.. ఆ సెంటిమెంట్.