చాలామంది అసిస్టెంట్ దర్శకులు.. డైరెక్టర్లుగా మారుతూ ఉంటారు. అలాంటి టాప్ డైరెక్టర్లలో బి గోపాల్ ఒకరు. ఈయన ముందుగా పిసి. రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు దగ్గర ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడుగా పనిచేశారు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన 12 సినిమాలకు బి. గోపాల్ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ టైంలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు.. గోపాల్‌లో ఉన్న ప్రతిభ గుర్తించి తన బ్యానర్లో ఓ సినిమా తీసి ఛాన్స్ ఇచ్చారు.
అలా ప్రతిధ్వని సినిమాతో బి.గోపాల్ దర్శకుడుగా ప్రయాణం ప్రారంభించారు. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, ఇన్‌స్పెక్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అల్లరి రాముడు, ఇంద్ర, స్టేట్ రౌడీ, కలెక్టర్ గారు, అడవి రాముడు, మస్కా లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆయన తెలుగు తెరకు అందించారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు హీరోగా గోపాల్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా అసెంబ్లీ రౌడీ.
ఈ సినిమాలో దివంగత నటి దివ్యభారతి హీరోయిన్గా నటించింది. సినిమాలో ఒకే ఒక గ్లామర్ సీన్ ఉంటుంది. అది బాత్ రూమ్ సీన్. అయితే ఆ గ్లామర్ సన్నివేశం షూటింగ్ రోజు దివ్యభారతి టైంకు రాలేదట. మోహన్ బాబు ఏమైంది ? ఎంతసేపు ఆలస్యం చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారట. దివ్యభారతి షూటింగ్‌కి ఎందుకు రాలేదని ఆరా తీస్తే ఆమె ఏడుస్తుందట. అసలు షూటింగ్‌కి రానని మొండికేసిందట.
ఎందుకంటే అది బాత్రూం సీన్.. తాను బాత్రూం సీన్ లో డ్రెస్ వేసుకోనని… షూటింగ్‌కు డుమ్మా కొట్టేస్తానని చెబుతోందట. ఈ విషయం మోహన్ బాబుకు తెలిస్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారని… దీంతో బి. గోపాల్‌కు ఏం చేయాలో తెలియటం లేదు. ఎట్టకేలకు దివ్యభారతి తల్లిని కన్విన్స్ చేయడంతో ఆమె తన కూతురిని ఒప్పించిందట. నిజంగానే గోపాల్.. దివ్యభారతి దగ్గరకు వెళ్లేసరికి ఆమె భోరున ఏడ్చేస్తుందట.
నేను ఈ డ్రెస్ వేసుకోను అని మారం చేస్తుందట. అయితే ఈ డ్రెస్ ఎందుకు ? వేసుకోవాలనేది ఆ తల్లి, కూతురు ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పాడట గోపాల్. చివరికి తల్లి.. దివ్య భారతిని ఒప్పించడంతో ఆమె ఐదు నిమిషాల్లో రెడీ అయి స్పాట్‌లోకి వచ్చేసిందట. సినిమాలో ఈ సీన్ చాలా బాగా క్లిక్ అయిందని దర్శకుడు గోపాల్ చెప్పుకొచ్చారు.