బిగ్ బాస్ బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన ఈ గేమ్ షో ఎంత సక్సెస్ అవుతుందో మనం చూస్తున్నాం. ఇప్పటికి ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ ఏడవ సీజన్ రన్ అవుతుంది. మరికొద్ది వారాల్లోనే ఈ సీజన్ కూడా కంప్లీట్ కాబోతుంది . కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోపలికి వచ్చే ఎపిసోడ్స్ జరుగుతున్నాయి . ఇప్పటికే హౌస్ లోకి చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి సందడి చేసిన ప్రోమోస్ ని ఎపిసోడ్స్ ని మనం చూసాం .
కాగా రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో భారీ కుట్ర జరిగింది అంటూ అభిమానులు కనిపెట్టేశారు . ముఖ్యంగా శివాజీ కొడుకు కెన్ని విన్నర్ ఎవరో చెప్పేసాడు అని దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు . ఫ్యామిలీ వీక్ నేపథ్యంలో శివాజీని కలిసేందుకు పెద్దకొడుకు కెన్ని హౌస్ లోకి వచ్చాడు . నాన్నను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు అందరితో సరదాగా మాట్లాడారు . పల్లవి ప్రశాంత్ యావర్ లకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాడు. భుజానికి గాయమైనప్పుడు మీరిద్దరూ మా నాన్నను బాగా చూసుకున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆ తర్వాత సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఎవరు రెచ్చగొట్టిన ఓవర్గా రియాక్ట్ అవద్దు నాన్న అంటూ సజెస్ట్ చేస్తారు . అంతే కాదు ఫైనల్ విక్స్ లో మీరు మరింత స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ సలహా ఇస్తాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే కెన్ని చేతిని శివాజీ వేలుతో గోకాడు.. కెన్ని తండ్రి తొడపై చేయి వేసి ఏదో రాసినట్లుగా కెమెరాస్ లో కనిపిస్తుంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ లో హౌస్ లోని కెమెరాస్ హైలెట్ చేశాయి .
అంతేకాదు శివాజీకి కెన్ని కోడ్ లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడుకున్నారు అని . బహుశా విన్నర్ ఎవరు ..? బయట టాక్ ఏంటి ..? అని లీక్ చేసి ఉండొచ్చు అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది . సోషల్ మీడియాలో పోల్స్ ఆధారంగా ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ శివాజీకి పల్లవి ప్రశాంత్ లకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆ తర్వాత స్థానంలో అమర్ -ప్రియాంక -గౌతమ్ స్థానాల్లో ఉన్నారు . దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది..!!