యూనివర్సల్ హీరో కమలహాసన్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం. అప్పట్లో భారతీయుడు సినిమా ఇండియన్ సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. భారతీయుడు లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడం నిజంగా కమలహాసన్ కే చెల్లింది. ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి.
అలాంటి సూపర్ డూపర్ హిట్ సీక్వెల్ గా రెండున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతుంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మూడేళ్ల క్రిందటే ప్రారంభమైంది. కరోనాతో పాటు కొన్ని కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అయింది. ఇక ఈ సెన్సేషనల్ సీక్వెల్ నుంచి మేకర్స్ రీసెంట్గా ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రో గ్లింప్స్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్‌ని దర్శకుడు శంకర్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తెరకెక్కిస్తున్నారు. ప్రతి చోటా కూడా తనదైన పనితనంతో శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఓ క్రేజీ సీక్వెన్స్ ని షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఓ సీన్ షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్లో శంకర్‌తో పాటు ఏకంగా ఎనిమిది వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారట.
దీంతో మొత్తం నాలుగు రోజులు అక్కడ బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ మీటింగ్ నేపథ్యంలో వచ్చే ఈ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండియన్ క్రేజీ ప్రాజెక్టు అయిన ఇండియన్ 2 సినిమాలో విజయవాడ భాగం కావటం విశేషం అని చెప్పాలి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.