ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ తండ్రి కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . రీసెంట్ గానే రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు శర్వానంద్. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . ఈ జంట ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ పలువురు ప్రముఖులు సైతం ఆశీర్వదించారు . సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రక్షిత రెడ్డి తల్లి కాబోతుంది .. శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు .
ఇప్పుడు ఆమెకు అయిదవ నెల అంటూ తెలుస్తుంది. అంతేకాదు పెళ్లి తర్వాత శర్వానంద్ రక్షిత అమెరికా వెళ్ళిపోయారు. రక్షిత రెడ్డి అమెరికాలో జాబ్ చేస్తుంది . అందుకే అక్కడే ఉంటున్నారు . శర్వానంద్ షూటింగ్ టైంలో మాత్రమే ఇండియాకు వస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రక్షిత రెడ్డి ప్రెగ్నెంట్ అన్న వార్త వైరల్ అవుతుంది . అయితే ఇక్కడ ఓ స్పెషల్ ట్రీట్ కూడా ఉంది.
రక్షిత రెడ్డి శర్వానంద్ లకు పుట్టబోయే బిడ్డ మోస్ట్ మోస్ట్ స్పెషల్ . ఎందుకంటే ఆ బిడ్డ మార్చిలోనే ఈ ప్రపంచంలోకి రాబోతుంది . మార్చి లో శర్వానంద్ రక్షిత రెడ్డి ఇద్దరు పుట్టినరోజులు ఉన్నాయి. అదే స్పెషల్ మంత్ లో వాళ్ళ బేబీ కూడా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!