Newsలావ‌ణ్య పెళ్లి డ్రెస్ స్పాన్స‌ర్ రేటు ఇదే... ఇలా కూడా పిండేశారా...!

లావ‌ణ్య పెళ్లి డ్రెస్ స్పాన్స‌ర్ రేటు ఇదే… ఇలా కూడా పిండేశారా…!

సెలబ్రిటీలు ఏం చేసినా ఆదాయమే. నయనతార తన పెళ్లి వీడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు మంచి మంచి డ్రెస్ లతో ఫోటోలు దిగటం వెనక దుస్తుల దుకాణాల నుంచి వచ్చే ఆదాయాలు దాగి ఉంటాయి. ఆ ఫోటోలు తమ సోషల్ మీడియా ఖాతాలలో లోడ్ చేయడానికి సైతం సెలబ్రిటీలు భారీగా ఛార్జ్ చేస్తారు. ఇక వారికి ఇన్‌స్టా అకౌంట్‌లో ఉన్న ఫాలోవర్స్‌ను బట్టి.. వారి రేంజ్‌ను బట్టి వారి క్రేజ్‌ను బట్టి ఆదాయం ఉంటుంది.

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా ఆమె, మరికొందరు బంధువులు వేసుకున్న డ్రెస్సుల ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేయడానికి కూడా స్పాన్సర్షిప్ ఒప్పందం ముందే కుదిరిందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ పెద్ద సంస్థ రూ.30 లక్షలకు పైగా చెల్లించి పెళ్లికూతురు డ్రెస్సులు ఇచ్చి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆ సంస్థకు ఏం కలిసి వస్తుంది అంటే.. ఆ డ్రెస్‌లతో పెళ్లి వాళ్లు వేసుకున్న రకరకాల పార్టీ వేర్‌ల‌తో కూడిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తారు.

అలాగే వాటిని సంస్థ‌ తన ప్రచారానికి కూడా వాడుకుంటుంది. అలా ఇటు సంస్థకు లాభం, అటు సెలబ్రిటీలకు ఆదాయం ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందన్నమాట. ఒకసారి సెలెబ్రెటీ స్టేటస్ తెచ్చుకుని ఇన్‌స్టాలో ఫాలోవ‌ర్లను భారీగా పెంచుకోగలిగితే ఏ మాత్రం శ్రమ పడకుండా ఆదాయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదనుకుంటా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news