అంతా బాగానే ఉంది కానీ ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందా అంటే ? సందేహమే అని చెప్పాలి. ఎవరా హీరోయిన్ ఏమా కథ అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు మృణాల్ ఠాగూర్.
సీతారామం సినిమాలో ఆమె అద్భుతమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం నాని సరసన నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలోనూ ఇల్లాలి పాత్రలో అదరగొడుతుంది. ఇవన్నీ ఆమెలో నటనను వెలికి తీసే పాత్రలే ఇలా కేవలం నటనకు మాత్రమే పరిమితమైతే టాప్ పొజిషన్‌కు వెళ్లలేరు.
పూజా హెగ్డే, సమంత, రష్మిక, నయనతార వీళ్లంతా టాప్ హీరోయిన్లు. అయితే వీళ్ళు కేవలం నటనతోనే పోసిషన్ కి వెళ్లలేదు. వీళ్లంతా గ్లామర్ రోల్స్ చేశారు. ఆ తర్వాత నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకున్నారు. ప్రస్తుతం రష్మిక కూడా అదే దారిలో వెళుతూ ఉంది. అయితే ఇందుకు భిన్నంగా కీర్తి సురేష్ ముందు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంది. మహానటి తర్వాత ఆమె ఓ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయింది.
ఆ తర్వాత ఆమెకు ఓ తరహా పాత్రలే వచ్చాయి. ఆమెకు గ్లామర్ పాత్రలు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కట్ చేస్తే ఆమెకు స్టార్ హీరోలు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వలేదు. మహేస్‌బాబు సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ ఇచ్చినా అప్పటికే కీర్తి ఫేడవుట్ దశలో ఉంది. అందుకే ఆ సినిమాలోనూ ఆమెను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె గ్లామర్ హీరోయిన్ కాకపోవడమే ఆమెకు పెద్ద మైనస్.
నిత్యామీనన్, సాయిపల్లవి లాంటి వాళ్లకు టాలెంట్ ఉండి కూడా ఎందుకు స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాలేదంటే ప్రధాన కారణం వాళ్లు గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉండడమే. ఇప్పుడు మృణాల్ కూడా తాను సమంత, రష్మిక, నయనతార లాంటి నటీమణుల కన్నా నటనలో తోపు అనుకుంటూ గ్లామర్ పాత్రలకు దూరంగా వెళుతోన్న పరిస్థితి. ఆమె ఇదే పంథాలో వెళితే స్టార్ హీరోయిన్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. మరి మృణాల్ అసలు వాస్తవం ఎప్పుడు తెలుసుకుంటుందో ? చూడాలి.