Moviesతెలుగు ఇండస్ట్రీలో ముంబై తెలివితేటలు చూయిస్తున్న జాన్వీ.. పుష్ప2 ను కాదని...

తెలుగు ఇండస్ట్రీలో ముంబై తెలివితేటలు చూయిస్తున్న జాన్వీ.. పుష్ప2 ను కాదని ఆ హీరో మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందా..?

అవునండి .. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది టైంలోనే జాన్వి కపూర్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందా..? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పోతుంది . తెలుగులో కూడా దేవర సినిమా ద్వారా డెబ్యూ ఇస్తుంది.

మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో డెబ్యూ ఇస్తుంది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే ఇప్పటివరకు రెండో సినిమాపై అఫీషియల్ ప్రకటన చేయని జాన్వికి మాత్రం బోలెడు అవకాశాలు వస్తున్నాయట . అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ . కాగా తాజాగా జాన్వికి సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ తెలుగులో బడా హీరో అయిన చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకునిందట .

శంకర్ అంటే చాలా ఇష్టం గల బోనీకపూర్ ఆయన డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో తన కూతురు చేత ఐటెం సాంగ్ చేయించడానికి ఓకే చేశారట. ఈ సినిమాలో జాన్వి ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే గతంలో సుకుమార్ పుష్ప2 సినిమాలో ఆమెను ఐటెం సాంగ్ చేయించండి అని ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేసిన బోనీకపూర్ నో చెప్పాడు.” నా కూతురు నీ కంటికి ఐటమ్ గర్ల్ గా కనిపిస్తుందా..? సుకుమార్ ” అంటూ ఘాటుగా స్పందించారట . మరి అలాంటి బోనీకపూర్ ఇప్పుడు శంకర్ సినిమాలో ఎలా ఆమెను ఐటం సాంగ్ చేయినిస్తున్నాడు ..?అనేది వైరల్ అవుతుంది. దీంతో బన్నీ ఫాన్స్ జాన్వి కపూర్ పై బోనీ కపూర్ పై గుర్రుగా ఉన్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news