Moviesపెళ్లిలో సమంత స్టైల్ ని ఫాలో అయిన లావణ్య.. అంటే వీళ్లు...

పెళ్లిలో సమంత స్టైల్ ని ఫాలో అయిన లావణ్య.. అంటే వీళ్లు కూడా అదేనా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే ట్రెండ్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం ఇన్నాళ్లు సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట . ఫైనల్లీ పెళ్లి చేసుకోవడమే. కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటలీలో మూడు రోజులపాటు వీళ్ళ పెళ్లిని ఘనంగా జరిపించుకునింది ఈ జంట .

ఈ క్రమంలోనే లావణ్య – వరుణ్ పెళ్లి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే లావణ్య తన పెళ్లి చీరలో చాలా ముద్దుగా కనిపించింది . అంతేకాదు తన భర్త పై ఉండే ప్రేమతో పెళ్లి చీరను లైఫ్ లాంగ్ గుర్తుండి పోవాలంటూ పెళ్లి చీర చివరిన #వరులవ్ అంటూ ముద్రించుకుని ఇన్ఫినిటీ సింబల్ ను పెట్టించుకుంది. అయితే గతంలో ఇదే విధంగా సమంత కూడా ఇలా నే చేసింది .

చై-సామ్ అని ముద్రించుకుని ఇన్ఫినిటీ సింబల్ ను పెట్టించుకునింది . దీంతో సమంత లాగే లావణ్య కూడా అదే స్టైల్ ఫాలో అయింది అని కొందరు చెప్తుంటే ..మరి కొందరు మాత్రం అలా చేయించుకున్న సామ్ మొగుడ్ ని వదిలేసింది.. అంటే లావణ్య కూడా అదే లిస్టులోకి వస్తుందా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మరి కొందరు మాత్రం వరుణ్ లావణ్య ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అంటూ ఆశీర్వదిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news