ఈ మధ్యకాలంలో సినిమాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూస్తున్నాం . భారీ భారీ బడ్జెట్ పెట్టినా.. భారీ భారీ తారగానం ఉన్న ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది . సింపుల్ బడ్జెట్ తో సింపుల్ సింపుల్ కాన్సెప్ట్ తో అసలు మనకు తెలియని నటీనటులను పెట్టిన ఆ సినిమా హిట్ అయిపోతుంది . అలా తయారైపోయింది నేటి కాలం సినిమా ఇండస్ట్రీ. అయితే రీసెంట్ గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన పని ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్ కు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది . సందీప్ రెడ్డి వంగ తాజాగా రన్బీర్ కపూర్ రష్మిక మందన్నాలతో యానిమల్ అనే సినిమాను తెరక్కించాడు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ – లుక్స్ – పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి .
అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతా బాగుందిలే సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు అనుకున్న థియేటర్స్ ఓనర్స్ కు కొత్త సమస్య వచ్చి పడింది. సందీప్ రెడ్డివంగా ఈ సినిమాను ఏకంగా మూడు గంటల 15 నిమిషాల టైంను ఫిక్స్ చేశారట . ఇది చాలా చాలా ఎక్కువ ఒరిజినల్ సినిమా స్టోరీ కన్నా ఇది ఎక్కువగానే ఉంది . పోనీ రెండు పార్ట్ లు గా తరికెక్కిస్తామంటే సాగదీసినట్లు ఉంటుందేమో అంటూ వద్దనుకున్నారట . మొదటి రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ముందుకు వెళ్లిపోవాలి అంటూ మూడు గంటల 15 నిమిషాల టైంను ఫిక్స్ చేశాడట సందీప్.
అయితే ఇది థియేటర్స్ ఓనర్స్ కు చమటలు పట్టించేస్తుంది . ఇంతింత లెంత్ సినిమా అంటే ఒక షో అయిన తర్వాత నెక్స్ట్ షోకి ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. దీని వల్ల పొరపాట్లు కూడా జరగొచ్చు . ఫాన్స్ కి కోపం వస్తే థియేటర్ ఏ రేంజ్ లో మార్చేస్తారో కూడా వాళ్లకు తెలుసు . దీంతో థియేటర్స్ ఓనర్స్ కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ మా కష్టాలను అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే కచ్చితంగా జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . మరి ఆ సినిమాని వదులుకోలేరు అలా అని బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే సోస్ వేయడానికి ఇష్టపడను లేరు .. ఏం చేస్తారో వీళ్ళు చూద్దాం..!!