నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న వచ్చే నెల మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. సినిమాలో డాటర్, ఫాదర్ సెంటిమెంట్‌తో పాటు హీరో, హీరోయిన్ లవ్ కెమిస్ట్రీ తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్లు బాగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా మూడో సింగిల్‌ను రిలీజ్ చేశారు. మృణాల్ ఠాకూర్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో మొదలైన ఈ సాంగ్‌లో హీరోయిన్ తన భర్తగా చేసిన నాని గురించి పాడుతున్నట్టుగా పాట ఉంది. తామిద్దరి బంధం ఎంత బలమైందో ఈ పాటతోనే మృణాల్ పాత్ర చెప్పకనే చెప్పేసింది. నాని తనను ఎలా చూసుకుంటాడో విడమర్చి చెపుతూ మృణాల్ లిరిక్స్ రూపంలో చెప్పింది.
పెళ్లైన రోజు నుంచే తామిద్దరి అద్భుత ప్రయాణం అదిరిపోయిందని ఈ సాంగ్‌లో చెప్పకనే చెప్పింది. నాని – మృణాల్ రొమాంటిక్ లవ్ కెమిస్ట్రీతో పాటు హేషన్ అబ్దుల్ వాహబ్ సంగీతం చాలా శ్రావ్యంగా, వినసొంపుగా ఉంది. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ క్యాచీగా, అర్థవంతంగాను ఉన్నాయి. ఏదేమైనా ఈ సాంగ్ అయితే ఒకటికి నాలుగుసార్లు వినాలనిపించేలా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటకి వచ్చిన మూడు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా హాయ్ నాన్న సినిమా నిర్మించారు. బేబీ కియారా నాని కుమార్తెగా నటించింది. జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా… ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.