News' భ‌గ‌వంత్ కేస‌రి ' 15 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ 15 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్లు ఇవే.. బాల‌య్యా మ‌జాకానా..!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ ద‌స‌రా కానుక‌గా గ‌త నెల 19న థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఎంట‌ర్టైన్ చేసింద‌నే చెప్పాలి. సంక్రాంతికి వీర‌సింహారెడ్డిగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ర్జించిన బాల‌య్య 8 నెల‌ల గ్యాప్‌లోనే మ‌రోసారి భ‌గవంత్ కేస‌రితో హిట్ కొట్టారు.

ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి ఎంట‌ర్ అయిన భ‌గ‌వంత్ కేస‌రి ఇప్ప‌టి వ‌ర‌కు వరల్డ్ వైడ్ గా 135.73 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇదే విషయాన్ని ఈ సినిమా నిర్మాత‌లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా షేర్ కూడా రు. 65 కోట్లు దాటేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసిన భ‌గ‌వంత్ కేస‌రి ఓవ‌రాల్‌గా 98 % బ్రేక్ ఈవెన్ అయిన‌ట్టు స‌మాచారం. బాల‌య్య‌కు జోడీగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో శ్రీ లీల కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమా లో విలన్ రోల్ లో నటించారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో చెప్పుకోద‌గ్గ సినిమాలు పోటీలో లేక‌పోవ‌డంతో మ‌రో వారం రోజుల పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాల‌య్య సినిమాకు తిరుగులేదనే చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news