ఎట్టకేలకు మెగా కపుల్స్ ఒకటయ్యారు. మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ – సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అత్యంత వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి ఫోటోలు చూసిన మెగా అభిమానులు.. టాలీవుడ్ అభిమానులు వరుణ్ తేజ్ – లావణ్య జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
చూడ ముచ్చటైన జంట, సూపర్ జోడి, సూపర్ కపుల్, క్యూట్ కపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక వరుణ్ – లావణ్య భార్యాభర్తలుగా సరికొత్త వైవాహిక జీవితాన్ని ప్రారంభించనున్నారు. 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తరకెక్కి రిలీజ్ అయిన మిస్టర్ సినిమా టైమ్‌లో ఇటలీలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోని మరోసారి ఈ జంట జోడి కట్టారు.
విచిత్రం ఏమిటంటే ఆరేళ్ల పాటు సీక్రెట్ గా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈ జంట కొద్ది నెలల క్రితం వరకు కూడా తమ ప్రేమను బయట పెట్టలేదు. ఇక ఈ భార్యాభర్తల మధ్య ఏజ్ ఎంత అనే విషయం ఆసక్తిగా మారింది. లావణ్య – వరుణ్ మధ్య కేవలం 11 నెలల ఏజ్ గ్యాప్ ఉంది. వరుణ్ జనవరి 19, 1990లో జన్మించాడు. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990 లో పుట్టింది.
దీనిని బట్టి చూస్తే వీరి మధ్య కేవలం 11 నెలల యేజ్ గ్యాప్ ఉంది. అంటే ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో జన్మించారు. ఇద్దరు పర్ఫెక్ట్ జోడి అని కూడా చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు తమ సినీ కెరీర్ కంటిన్యూ చేస్తారు.