Newsఆ సినిమాలోని డైలాగ్ ని నిజం చేసిన లావణ్య.. అన్నట్లే చేసి...

ఆ సినిమాలోని డైలాగ్ ని నిజం చేసిన లావణ్య.. అన్నట్లే చేసి చూపించిందిగా..మెగాస్టార్ ని రప్పించింది..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ ప్రిన్స్ హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా వరుణ్ లావణ్యల మధ్య ప్రేమ పుట్టడానికి కారణమైన మిస్టర్ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఇక్కడే అభిమానులు ఇంట్రెస్టింగ్ న్యూస్ ని కనుక్కున్నారు. లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సినిమా అందాల రాక్షసి .

ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది . ఆ డైలాగ్ ఇప్పుడు నిజ జీవితంలో ఆమెకు రిపీట్ అయింది అంటూ ట్రెండ్ చేస్తున్నారు . అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాఠి ఓ సీన్లో మాట్లాడుతూ చిన్న పిల్లలంతా “లావణ్య అక్క.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంట కదా..?” అంటూ ప్రశ్నిస్తారు. ” అంతేకాదు పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా..?” అంటూ లావణ్యను అడుగుతారు . అందుకు లావణ్య అవునని సమాధానం చెబుతుంది .

ఆ తర్వాత పిల్లలంతా “గ్యాంగ్ లీడర్ కూడా వస్తున్నాడంటరోయ్ “అంటూ అల్లరి చేస్తారు . ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది . అయితే లావణ్య ఏ ముహూర్తాన ఆ మాట చెప్పిందో తెలియదు కానీ 2023లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగానే తన పెళ్లిని జరిపించుకుంది . ప్రజెంట్ ఇదే డైలాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . విధి అంటే అంతే అంటూ కొందరు భారీ కొటేషన్ డైలాగ్స్ పెడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news