Newsఅల్లు అర్జున్ నుండి ఫస్ట్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్.....

అల్లు అర్జున్ నుండి ఫస్ట్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్.. అదే హీరో అదే డైరెక్టర్.. ఇక ఫ్యాన్స్ ని ఆపలేం..!!

వాట్ .. అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడా? అది కూడా ఆ టాప్ హీరోతోనా..? ఇక ఫాన్స్ ని ఆపలేం రా బాబోయ్ . ఫ్యాన్స్ కి ఇంతకన్నా మంచి గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది . రీసెంట్గా పుష్ప సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్దాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . రీసెంట్ గానే పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకున్నాడు .

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో బిగ్ మల్టీస్టారర్ మూవీ ఓకే చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ కథను రాసింది ఎవరో కాదు విజయేంద్ర ప్రసాద్ . రాజమౌళి తండ్రి అంటూ తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో ఈయన ఇంటర్నేషనల్ రైటర్ గా మారిపోయాడు .

అలాంటి విజయేంద్ర ప్రసాద్ రైటింగ్లో బన్నీ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కి ఊపు ఉండదా..? కచ్చితంగా ఉంటుంది . అది కూడా కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ..ఇక రచ్చ రంబోలానే . పుష్పకి మించిన హిట్ కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అజిత్ అల్లు అర్జున్ మధ్య డైలాగ్స్ చాలా చాలా కేర్ఫుల్ గా రాసారట విజయేంద్ర ప్రసాద్. అయితే ఈ సినిమా ను రాజమౌళి తెరకెక్కిస్తాడా..? వేరే డైరెక్టరా..? అని తెలియాల్సి ఉంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news