తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా నిలదొక్కుకోవడం స్టార్స్ గా ఎదగడం ఒకప్పటిమాట. ఇప్పట్లో అలాంటి పరిస్థితులు లేవనే చెప్పొచ్చు. తెలుగమ్మాయిలు నటిస్తున్నారు. కానీ, హీరోయిన్స్ వాళ్ళు ముంబై మోడల్స్ ని తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ మాదిరిగా ఒళ్ళు చూపించలేరు. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయలేరు. బికినీ వేసి జనాలను రెచ్చగొట్టలేరు.
మేకర్స్ కి స్పెషల్ గా ఆఫర్స్ ఇవ్వలేరు. ఒక సినిమాను ఒప్పుకోవడానికి నార్త్ ఇండియన్స్ కి ఒక్క రోజు పట్టదు. అదే తెలుగమ్మాయిని సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఒక పట్టాన ఒప్పుకోరు. కట్టుబాట్లు అంటూ గిరిగీసుకొని కూర్చుంటారు. అలాంటి లెక్కలు నిర్మాతలకి కష్టం. అందుకే, మన దర్శకనిర్మాతలంతా కొత్త సినిమా మొదలు పెట్టేముందు ముంబై ఫ్లైటెక్కేస్తున్నారు.
వాళ్ళైతే అన్నింటికీ సపోర్ట్ చేస్తారు. ఇందులో సందేహమే లేదు. ఈ విషయం ఎప్పుడో అందరికీ అర్థమైంది. అందుకే, మన తెలుగమ్మాయి రీతూ వర్మ లాంటి వారు ఇక్కడ సినిమాలు చేసినా స్టార్ డం ని మాత్రం సంపాదించుకోలేపోతున్నారు. ఈషా రెబ్బా, రీతూ వర్మ తెలుగు వాళ్ళు కాబట్టే మంచి సినిమాలు చేసినా ఒక స్టేజ్‌లో ఆగిపోయారు.
అదే పర భాషలో తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే సంయుక్త మీనన్ లాంటి వాళ్లు ఇక్కడ రెండవ సినిమాకే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే సైగలకే అవకాశాలు దండిగా ఒచ్చిపడుతున్నాయి. తెలుగమ్మాయా..? చూద్ధాంలే అని మేనేజర్స్ ఎవరైనా రీతూ వర్మ లాంటి వారిని ప్రపోజ్ చేస్తే సైలెంట్‌గా పక్కన పెడుతున్నారు. ఇక్కడ లక్, అందం కంటే కూడా తెలుగమ్మాయి అయితే అవకాశాలు దక్కడం లేదనే విషయం అర్థం అవుతోంది.