టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూడటానికి చాలా సింపుల్‌గా తనకేమి తెలియని వాడిలా తనకేం పట్టనట్టుగా కనిపిస్తాడు. కానీ లోపల చాలా వ్యవహారాలు చక్కపెట్టేస్తాడు. ఒక్కోసారి పెద్దమనిషి అవతారం ఎత్తి తన వయసుకు మించిన పనులు కూడా చేస్తాడని అంటూ ఉంటారు. తారక్ వల్ల టాలీవుడ్ లో ఒక టాప్ మహిళా ప్రొడ్యూసర్ ప్రేమ పెళ్లి జరిగింది అనేది మీకు తెలుసా..!
ఆ టాప్ మహిళ ప్రొడ్యూసర్ ఎవరో కాదు వైజయంతి మూవీస్ అధినేత అధినేత చలసాని అశ్విని దత్ కుమార్తె స్వప్నదత్. తండ్రి తర్వాత వైజయంతీ బ్యానర్ బాధ్యతలను తన సోదరి ప్రియాంక దత్‌తో కలిసి స్వప్న చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రసాద్ వర్మ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ 3 నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
అంతకుముందే స్వప్న సోదరి.. ప్రియాంక దత్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ పెళ్లి అశ్వినీదత్‌కు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకున్నారు. ఇక రెండో కుమార్తె కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటాను అంటే ఆయన ఒప్పుకోరని స్వప్న ఈ విషయాన్ని చాన్నాళ్లపాటు సీక్రెట్ గా ఉంచింది. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పడంతో ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఈ విషయాన్ని అశ్విని దృష్టికి తీసుకువెళ్లారు.
అశ్వనీదత్ ఇంటికి వెళ్లి మరీ ఈ విషయమై మాట్లాడి ఒప్పించారు. నిజం చెప్పాలంటే స్వప్న ప్రేమ విషయాన్ని అశ్వినీ దత్‌కు నేరుగా చెప్పొచ్చు. లేదా ఇండస్ట్రీలో ఆయనకు చాలామంది సన్నిహితులు ఉన్నారు. రాఘవేంద్రరావు లాంటి పెద్దలు కూడా అశ్వినీ దత్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ స్వప్న ఎన్టీఆర్ మీద నమ్మకంతో తన ప్రేమ గురించి చెప్పగా.. ఎన్టీఆర్ స్వయంగా అశ్వినీదత్‌తో మాట్లాడి ఈ ప్రేమ పెళ్లికి పెద్దరికం వహించి పెళ్లి జరిగేలా చూశారు.