తెలుగు సినిమా చరిత్రలో స్టార్ రైటర్ గా పేరు సొంతం చేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్. తెలుగులో మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు స్టోరీలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సిరీస్ సినిమాలు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ గతంలో ఎంతో మంది స్టారో హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ స్టోరీలను అందించారు.
ఆయన కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలుకు అదిరిపోయే స్టోరీలు ఇచ్చిన ఘనత విజయేంద్రప్రసాద్ సొంతం. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ బజరంగీ భాయి జాన్ సినిమాకు కూడా విజయేంద్రప్రసాద్ స్టోరీ అందించారు. విజయేంద్రప్రసాద్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా కోసం మల్టీస్టారర్ స్టోరీ రాసినట్టుగా తెలుస్తుంది.
అసలు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఆయన రాసిన కథ అద్భుతం అని చెప్పాలి. ఇప్పుడు నిజంగా బాలయ్య, చిరంజీవి ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ వీళ్లిద్దరి మల్టీస్టారర్ సినిమా అంటే అది నిజంగా సంచలనమే అవుతుంది. ఈ సినిమాకు రాజమౌళి మాత్రమే దర్శకత్వం వహిస్తే కరెక్టుగా ఉంటుంది.
మరో దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే ఈ ఇద్దరు హీరోల మధ్య ఖచ్చితంగా బ్యాలెన్స్ తప్పుతుందని చెప్పాలి. నిజంగా బాలకృష్ణ – చిరంజీవిని పెట్టి రాజమౌళి మల్టీస్టారర్ సినిమా తీస్తే తూర్పు – పశ్చిమ ధృవాలను ఏకం చేసినట్టుగానే భావించాలి. అది టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అవుతుందటంలో సందేహం లేదు.