టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే కాక్టైల్ పార్టీ కూడా పూర్తయ్యింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ధూమ్‌ధామ్‌గా జరుగుతున్నాయి. వీరిద్దరి తొలిసారిగా ప్రేమలో పడింది ఇటలీలో కావడంతో వీరి వివాహ వేడక కూడా అక్కడే జరపాలని డిసైడ్ అయ్యారు.
అయితే ఈ వివాహానికి టాలీవుడ్ మాజీ భార్య భర్తలు అయిన అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ హాజరవుతున్నారు. వీరితో పాటు రష్మిక మందన్న కూడా ఇటలీ వెళుతున్నారు. వీరంతా ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లారు. ఏదేమైనా చైతు – సమంత ఈ పెళ్లికి వెళ్లడమే పెద్ద హైలెట్. విడాకుల తర్వాత వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధాలే చేసుకుంటున్నారు.
అలాంటి టైంలో అతి తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందింన మరో హీరో, హీరోయిన్ పెళ్లికి వీరు వెళ్లడం అంటే ఆశ్చర్యమే. ఇక వీరిద్దరు ఆ పార్టీలో ఎదురు పడకుంగా ఉండరు. ఒకవేళ ఎదురు పడితే వీరి హావభావాలు ఎలా ఉంటాయన్నది కూడా ఉత్కంఠగా ఉంది. కనీసం మాట వరుసకు అయినా విష్ చేసుకుంటారా ? పలకరించుకుంటారా ? ఇప్పుడు ఇది మామూలు సస్పెన్స్‌గా లేదు.
ఇక వీరితో పాటు రష్మిక కూడా ఇప్పటికే ఇటలీ బయలు దేరి వెళ్లారు. ఏదేమైనా చైతు, సమంత, రష్మిక వీళ్లందరితో వరుణ్ – లావణ్య పెళ్లిలో కావాల్సినంత గ్లామర్ సంతరించుకోనుంది.