Movies"ఆ మూడు ఉంటే లైఫ్ మొత్తం జిల్ జిల్ జిగా"..రౌడీ హీరో...

“ఆ మూడు ఉంటే లైఫ్ మొత్తం జిల్ జిల్ జిగా”..రౌడీ హీరో అనిపించాడుగా..!!

విజయ్ దేవరకొండ .. సక్సెస్ కి పర్ఫెక్ట్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఒకరు హెల్ప్ లేకుండా .. ఒకరి సపోర్ట్ లేకుండా.. తాను అనుకున్నది తాను చేసే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా సరే .. రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకుని వాళ్లకు మించిన క్రేజ్ తో దూసుకుపోతున్నాడు దానంతటికి కారణం ఆయన హార్డ్ వర్క్ అని చెప్పాలి.

పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హిట్ తన ఖాతాలో వేసుకొని అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీని షేక్ చేసేసిన విజయ్ దేవరకొండ .. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా తెరకెక్కించిన క్రీడా కోలా అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసారు. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్య రావు , జీవన్, రఘురాం తదితరులు నటించారు .

ఈ సందర్భంగా హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించగా.. విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా పాల్గొని తనదైన స్టైల్ లో మాట్లాడాడు . ఆయన మాట్లాడుతూ..” మీ అందరికీ తెలుసు నన్ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత ఆయనకు చాలా చాలా మంచి అవకాశాలు వచ్చాయి కానీ ఏవీ చేయలేదు . ఎందుకంటే ఆయన డబ్బు మనిషి కాదు . మనం పెరిగిన వాతావరణం, తీసుకునే నిర్ణయాలు , కలిసే వ్యక్తులు ఈ మూడు అంశాలే మన లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. వాటి వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ..” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . అయితే విజయ్ దేవరకొండ చెప్పింది అబ్స్యల్యూట్లీ రైట్ అని ఈ మూడు అంశాలు ఉంటే లైఫ్ జిల్ జిల్ జిగా అయిపోతుంది అని రౌడీ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news