Moviesసందీప్ ఎలిమినేట్ అయిన నో ప్రాబ్లమ్..ఆ విషయంలో హౌస్ లో ఉన్న...

సందీప్ ఎలిమినేట్ అయిన నో ప్రాబ్లమ్..ఆ విషయంలో హౌస్ లో ఉన్న వాళ్లకంటే టాప్ ..!!

ఇప్పుడు సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ సందీప్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చాలా మంచి కామెంట్స్ దక్కించుకున్న సందీప్ మాస్టర్.. ఏ ముహూర్తాన బిగ్ బాస్ లోకి వెళ్ళాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నారు . మొదటివారం చాలా కూల్ గా సాగిన రెండో వారం నుంచి చాలామంది జనాలు సందీప్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ ట్రోల్ చేశారు .

అయితే ఇమ్యూనిటీ కారణంగా ఇన్నాళ్లు నామినేషన్ నుంచి తప్పించుకున్న సందీప్ ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చాడు దీంతో వెంటనే కోపం మొత్తం ప్రదర్శించిన జనాలు ఆయనకు ఓట్లు తక్కువగా వేసి ఎలిమినేట్ చేసి పడేశారు. హౌస్ నుంచి సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు . అయితే ఎలిమినేట్ అయి వచ్చాక సందీప్ మాస్టర్ చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి .

“ఇద్దరు కారణంగానే నేను బయటకు వచ్చేసానని.. ఆ ఇద్దరి వెన్నుపోటు మరిచిపోలేనని ..త్వరలోనే నేను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రీఎంట్రీ ఇస్తానని.. అప్పుడు నా అసలు గేమ్ ఏమిటో చూస్తారు అంటూ స్ట్రాంగ్ గానే కామెంట్ చేశారు . అయితే సందీప్ హౌస్ లో ఉన్నందుకుగాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వారానికి 2.75 చొప్పున ఆయన మొత్తం 22 లక్షలు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఇది నిజానికి మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. మిగతా వాళ్ళు 50,000 – 70000 అందుకుంటున్నారు. అయితే సందీప్ మాత్రం తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఏకంగా 2,75,000 వారానికి చార్జ్ చేశాడు. దీంతో ఉన్నన్ని రోజులు ఉన్న ఎలిమినేట్ అయిపోయి వచ్చేటప్పుడు భారీగానే వెనకేసుకొని వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news