Moviesబిగ్ బ్రేకింగ్: తమన్నా-విజయ్ వర్మ పెళ్లి ఫిక్స్..ముహుర్తం ఇదే..ఆ స్పెషల్ డేనే...

బిగ్ బ్రేకింగ్: తమన్నా-విజయ్ వర్మ పెళ్లి ఫిక్స్..ముహుర్తం ఇదే..ఆ స్పెషల్ డేనే నిశ్చితార్ధం..!?

ఎస్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు .అయితే ఇప్పటికే వరుణ్ – లావణ్య మరికొద్దిగంటలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా పెళ్లి పీటలుబ్ ఎక్కబోతుంది .

వెంకటేష్ రెండో కూతురు కూడా పెళ్లి చేసుకోబోతుంది. ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సైతం పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే టైంలో హీరోయిన్ తమన్నా సైతం తన పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది . విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నాను .. డేటింగ్ చేస్తున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించిన తమన్నా.. పెళ్లి మాత్రం అప్పుడే చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయింది .

అయితే సినిమా అవకాశాలు తగ్గుతూ ఉండడం .. విజయ్ వర్మ ఫ్యామిలీ నుండి ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో .. ఇక తప్పక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. అంతేకాదు నవంబర్ 17వ తేదీ నిశ్చితార్థం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఆమె పెళ్లి జరగబోతుందట . అయితే నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యేలా ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటుందట . దీంతో ఇండస్ట్రీలో మరో హీరోయిన్ వికెట్ డౌన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news