టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జన్వికపూర్ నటిస్తోంది.
ఆమెకు సౌత్ ఇండియాలో ఇదే తొలి సినిమా. అలాగే ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశాపటానిని తీసుకోవాలని చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో క్రేజీ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణని దర్శకుడు కొరటాల ఎంపిక చేశారు. దేవర కోసం ఆమె నవంబర్ మొదటివారంలో డేట్లు కూడా కేటాయించారని తెలుస్తోంది.
చాలా పవర్‌ఫుల్‌గా రమ్యకృష్ణ పాత్ర ఉండబోతుందని.. కొరటాల శివ తనదైన స్టైల్ లో ఆమె పాత్రను డిజైన్ చేశారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ సినిమాలలో రమ్యకృష్ణ నటించిన సింహాద్రి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించగా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హీట్ అయింది. ఆ తర్వాత నా అల్లుడు సినిమాలో ఎన్టీఆర్‌కు అత్తగా ఈమె నటించగా ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.
మళ్ళీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ – రమ్యకృష్ణ కాంబినేషన్లో సినిమా వస్తోంది. ఎన్టీఆర్ కోసం కొరటాల దేవర.. కథపై ఏకంగా ఏడాదిన్నర పాటు చాలా కసరత్తులు చేశాడు. కథలో అదిరిపోయే పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయట. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.