సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు . మనం ఊహించినటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే సినిమా ఇండస్ట్రీ . అయితే అలాంటి మాయలకు బలైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా. ఈ పేరు మొదట్లో తెలుగు జనాలకి పెద్దగా తెలిసేది కాదు . ఎప్పుడైతే ఆయన నీలి చిత్రాలు కేసులు అరెస్టు అయ్యారో అప్పుడు దేశవ్యాప్తంగా జనాలు చేత ఛీ కొట్టించుకున్నాడు .
రెండేళ్ల క్రితం నటి శిల్ప శెట్టి భర్త రాజకుంద్రా నీలి చిత్రాల కేసులు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే . అప్పట్లో ఈ న్యూస్ ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాలా ..? ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి శిల్పా శెట్టి బయట కనిపించడమే మానేసింది . ఇప్పుడిప్పుడే ముఖం నలుగురికి చూపిస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్గా రాజ్ కుంద్రా.. తన జైలు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టాడు. రాజకుంద్ర జీవితం ఆధారంగా “యూటీ 69”.. అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు .
ఈ క్రమంలోనే ఆయన జీవితంలో బ్యాడ్ ఫేస్ ని కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట . చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ కుంద్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలులో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పచ్చిగా చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” జైలుకు వెళ్తానని అస్సలు అనుకోలేదు.. వెళ్లిన ఫస్ట్ డే నే నా బట్టలు మొత్తం విప్పించేశారు. అండర్వేర్ కూడా తీసేసారు. నగ్నంగా నిల్చో పెట్టారు. నేను ఏదైనా నిషేధిత పదార్థాలు తీసుకువచ్చానేమో అన్న భయంతో నన్ను నిల్చోని వంగో పెట్టి వెనుక భాగంలో చెక్ చేశారు . నాకు చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది . అలాంటి ట్రీట్మెంట్ చూశాక నేను బ్రతికున్న చచ్చినట్టే అన్న ఫీలింగ్ కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం మట్టిలో కలిసిపోయాయి అంటూ బాధపడ్డాను. సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ నేను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను .. ఏదో ఒక రోజు నేను బయటకు వస్తానని నాకు తెలుసు .. ఆ రోజు కోసం నేను వెయిట్ చేశాను అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించాడు “రాజ్ కుంద్రా. దీంతో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!