వామ్మో .. ఏంటిది నిహారికపై ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా జనాలు..? ఆమె ఎక్కడికి వెళ్ళినా ..? ఎవరితో తిరిగినా..? ఎవరితో డిన్నర్ చేస్తున్న.. దానిని హైలెట్ చేయడానికి చూస్తున్నారు కొందరు మెగా హెటర్స్. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు చేసిన విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి నిహారిక పై కూసింత స్పెషల్ ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారు జనాలు .
మరో రెండు రోజుల్లో తన అన్న వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇటలీకి వెళ్లిన నిహారిక తన బావ వైష్ణవ్ తేజ్ తో తెగ సందడి చేస్తుంది . అంతేకాదు అక్కడ తన బావ వైష్ణవ్ తేజ్ తో కలిసి లంచ్ డేట్ కు వెళ్ళింది . దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇదంతా చాలా హెల్దీ గానే జరిగింది . అయితే కావాలనే కొందరు మెగా హెట్స్ర్స్ ఆమెపై ట్రోల్ చేస్తున్నారు .
“వేరే వాళ్లు అయితే నీకు ప్రాబ్లం అవుతుంది. సొంత బావనే చేసుకో.. చెప్పినట్లు వింటాడు” అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు హద్దులు మీరు పోయి “ఇతనేనా నీకాబోయే రెండో భర్త..?” అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక – పంజా వైష్ణవ తేజ్ లంచ్ డేట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే నిహారిక – సాయి ధరమ్ తేజ్ పై గతంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. వాటిని ఘాటుగా తిప్పి కొట్టింది నిహారిక . ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తలు వైష్ణవ్ తేజ్ తో వినిపిస్తూ ఉండడం మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు. అలా ట్రోల్ చేసే వెధవలకి వైష్ణవ్ కన్నా నీహారిక పెద్దది అని తెలియదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్..!!