ఇంకా సరైన టీజర్ రాలేదు, ట్రైలర్ కూడా వదలలేదు.. కనీసం మొన్న ప్రభాస్ పుట్టినరోజుకి కొత్త పోస్టర్ కూడా రాలేదు. అయినా సరే సినిమా నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఏపీ, తెలంగాణ కలిపి సుమారు రూ.175 కోట్లకు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇంత మొత్తం షేర్లు రావాలంటే గ్రాస్ కచ్చితంగా రూ.300 కోట్లు దాటేయాలి. అంటే ఆర్ఆర్ఆర్ సినిమా కన్నా కొంచెం తక్కువే అయినా ఆ స్థాయి టాక్ వస్తేనే సలార్ ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది.
అయితే సలార్ సినిమాపై ఉన్న అంచనాలు.. ఆ సినిమాకు ఉన్న బజ్ దృష్ట్యా ఇది సాధ్యమే అని.. టికెట్ రేట్‌ల పెంపుకు రెండు ప్రభుత్వాలు సహకరిస్తే ఈ టార్గెట్ సులువుగా చేరుకోవచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు సలార్ సినిమాకు ఏపీ, తెలంగాణలో జరిగిన రూ.175 కోట్ల బిజినెస్ ట్రేడ్ వర్గాలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లలో ఎడతెగని మంతనాలకు దారితీస్తుంది. ఏరియాలో వారికి ఆ డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ కొనుగోలు చేయాలంటే ముందుగా అంత డబ్బు రెడీ చేసుకోవాలి.
పైగా సినిమా డిసెంబర్ 22న రిలీజ్.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం వరకు కరెన్సీ లావాదేవీలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు నేపథ్యంలో కోటి రూపాయలకి మించిన నగదు చెల్లింపులపై చాలా గట్టిగా ఉంది. ఇక ఆంధ్ర, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు హక్కుల కోసం అదనంగా వడ్డీలకు అప్పులు తెచ్చి మరి కట్టేందుకు సిద్ధంగా ఉన్నమాట వాస్తవం.
మరోవైపు ఈ సినిమా రిలీజ్ ఒకరోజు ముందు షారుక్ ఖాన్ ఢుంకి నుంచి పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాలలో దాని ప్రభావం మరీ ఎక్కువ స్థాయిలో ఉండదని నమ్మకమే సలార్ పై అందరూ రిస్క్‌కి సిద్ధమయ్యేలా చేస్తుంది. డిసెంబర్ 22 తో మొదలుపెట్టి జనవరి 12 వరకు మధ్యలో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు అయితే లేవు.
అంటే 20 రోజుల టైం ఉంది. ఆ తర్వాత సంక్రాంతి సినిమాల హడావుడి ఉంటుంది. అప్పటికి సలార్ హడావుడి బాగా తగ్గిపోతుంది. అంటే మధ్యలో 20 రోజుల రన్ మాత్రమే సలార్ కు ఉంటుంది.
యావరేజ్ గా రోజుకు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్ళు రావాలి. అప్పుడు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే సలార్ ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న ఇమేజ్ తో పాటు ప్రశాంత్ నీల్ బ్రాండ్.. ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్.. ఇవన్నీ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండేలా చేస్తున్నాయి.