మాస్ మహారాజ రవితేజ, నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకేసారి తమ సినిమాలతో మూడుసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే మూడుసార్లు కూడా రవితేజనే పై చేయి సాధించారు. పరమవీరచక్ర, మిరపకాయ్ – కృష్ణ, ఒక్కమగాడు – మిత్రుడు, కిక్ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సందర్భాలలో రవితేజ సినిమాలు హిట్ అవ్వగా.. బాలయ్య సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
చాలా ఏళ్ల తర్వాత ఈ దసరాకు మరోసారి ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీపడ్డారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు, బాలయ్య భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలలో బాలయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వారం రోజులకే క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది. భగవంత్ కేసరి ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర రూ.125 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టింది.
తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న రవితేజ టైగర్ నాగేశ్వరరావు.. ఎనిమిది రోజులకు కానీ రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకోలేకపోయింది. ఏది ఏమైనా ఈసారి రవితేజపై బాలయ్య పూర్తి ఆధిపత్యం కనపరిచి విజయం సాధించారు. ఇక వసూళ్లు పరంగా చూసుకున్న రవితేజ సినిమా కంటే బాలయ్య సినిమాకు ఇప్పటికే రూ.75 కోట్లు ఎక్కువగా వచ్చాయి. బాలయ్య సినిమా వసూళ్లకు రవితేజ దరిదాపుల్లో కూడా లేరని చెప్పాలి.