ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇష్యూ గురించి అటు మీడియాలోను.. సోషల్ మీడియాలను పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ ?ప్రారంభమైంది. ఇది ఎలా పెరిగింది అన్నది చూస్తే తన తాజా ఇంటర్వ్యూలో బోయపాటి మాట్లాడుతూ తమన్‌పై పరోక్షంగా తన అసహనం వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. అఖండకి తమను బ్యాగ్రౌండ్ స్కోరు ప్రాణమయింది. కానీ స్కంద సినిమాకు అంత ఎఫెక్ట్ గా లేదు.. దానిపై మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్న బోయపాటికి ఎదురైంది.
దీనిపై బోయపాటి మాట్లాడుతూ స్కంద బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి నేను ఒకసారి రివ్యూ చేస్తాను అన్న బోయపాటి.. అఖండ సినిమాని మ్యూజిక్ లేకుండా చూసిన అదే హై ఉంటుంది.. ఆ కథలో అంత దమ్ము ఉంది అంటూ తమన్ చేసిందేమీ లేదు అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. బోయపాటి ఒకరకంగా తమన్‌ను తీసిపారేసినట్టే..! వీళ్ళిద్దరి కలయికలో సరైనోడు, అఖండ, స్కంద తదితర సినిమాలు వచ్చాయి.
బోయపాటి ఇలా అనటం కరెక్ట్ కాదు.. గతంలో దేవిశ్రీ మీద కూడా బోయపాటి ఇలాగే సెటైర్లు వేశారు. ఇక అఖండ సినిమాకు డైలాగులు ఎలా ప్రాణమో ? బిజిఎం కూడా అంతే ప్రాణం.. పైగా తమన్‌ను బాలయ్య అభిమాని.. అఖండ సినిమాకు ప్రాణం పెట్టి బిజిఎం ఇచ్చిన మాట వాస్తవం. సరే తమన్ మీద ఎన్ని విమర్శలు అయినా ఉండొచ్చు కాక.. తన పాతట్లనే మళ్లీ మళ్లీ ప్రయోగిస్తాడు.. ఎవరెవరి ట్యాన్లో కాపీ కొడతాడు.. కొన్ని సినిమాలు సూపర్ హిట్.. చాలా సినిమాల్లో సంగీతం ప్లాప్ కూడా..!
సరై అప్పుడెప్పుడో లెజెండ్ లాంటి హిట్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ మీదా ఇలాగే ఆడిపోసుకున్న బోయపాటి.. ఇప్పుడు ఏకంగా అఖండ సినిమాకు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చిన థమన్‌ను ఆడిపోసుకుంటున్నాడు. అలాగైతే మరి బోయపాటి తీసిన వినయ విధేయ రామ, స్కంద, దమ్ము సినిమాల పరిస్థితి ఏంటి ? వీటి నాణ్యత ఏంటన్న ప్రశ్నలకు బోయపాటే ఆన్సర్ చేయాలి.
దమ్ము సినిమాను ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటకీ మర్చిపోలేరు. ఇక వినయ విధేయ రామ పేరు చెపితే మెగాభిమానులే అసహ్యించుకుంటున్నారు. మరి అలాంటి బోయపాటి తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్ల పనితనాన్ని ఎందుకు తక్కవ చేసి బుర్ర తక్కువ మాటలు మాట్లాడతాడో తెలియదు.