టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తన తండ్రి నటశేఖర కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ తరం సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు తన కూల్ హ్యాండ్సం లుక్కుతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
మహేష్ హీరో గానే కాకుండా భర్తగా తండ్రిగా ఇటు సమాజ సేవకుడిగా తన బాధ్యతను తీర్చడంలో సక్సెస్ అవుతున్నారు. మహేష్ బాబుపైకి చూడటానికి చాలా కూల్ గా కనిపిస్తారు. మహేష్‌కు కోపం రావడం బహు తక్కువ. అయితే మహేష్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో ? అన్నది కాస్త ఆసక్తికరమైన విషయం. వరుసగా సినిమా షూటింగ్ ల నేపథ్యంలో మహేష్ బాబు కూడా సహజంగానే ఒత్తిడికి గురవుతూ ఉంటాడట.
ఆ టైంలో తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్పులు ప్లాన్ చేస్తూ ఉంటారు మహేష్. తన భార్య నమ్రతతో పాటు పిల్లలను తీసుకుని విదేశీ ట్రిప్పులు ఎంజాయ్ చేసి వస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. మహేష్ కు కెరియర్ ప్రారంభంలో కోపం వస్తే ఎదుటివారిపై చూపించే వారట. అయితే ఇప్పుడు అలా కాదు ఒక బలహీనతని బలంగా మార్చుకున్నాడు మహేష్. ఎంత కోపం వచ్చినా ఎంత చికాకుగా ఉన్నా ? దానిని ఇతరుల మీద చూపించటం, గొడవ పెట్టుకోవడం వంటివి అస్సలు చేయరట.
తను కోపం నుంచి బయటపడటానికి తన మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతారట. అందరూ మహేష్ లా ఆలోచిస్తే కోపం కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా తేలిక.. కోపం ఎక్కువైతేనే ఒత్తిడి పెరుగుతుంది.. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.. అందుకే అందరూ మహేష్ లాగే చాలా కూల్ గా ఆలోచిస్తే మంచిదనే చెప్పాలి.