Newsసెట్లోనే డైరెక్ట‌ర్‌పై మ‌హేష్ కోపం.. స్క్రిఫ్ట్ నేల‌కు విసిరి కొట్టాడా..?

సెట్లోనే డైరెక్ట‌ర్‌పై మ‌హేష్ కోపం.. స్క్రిఫ్ట్ నేల‌కు విసిరి కొట్టాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. మహేష్ నటించిన డిజాస్టర్ సినిమాలలో బ్రహ్మోత్సవం ఒకటి. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. అంతకుముందు ఇదే శ్రీకాంత్ దర్శకత్వంలో మహేష్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే మహేష్ శ్రీకాంత్ మీద నమ్మకంతో కథ కూడా పూర్తిగా వినకుండానే బ్రహ్మోత్సవం సినిమా చేసేందుకు ఓకే చెప్పేశారు.

శ్రీమంతుడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉండగా మహేష్‌ను కలిసిన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్లో సినిమాల ఫ్యామిలీ స్టోరీ సార్ కథ చాలా బాగుంటుంది… అన్న మాట చెప్పగానే మహేష్ కథ పూర్తిగా వినకుండా వెంటనే ఓకే చెప్పేశారు. అయితే అప్పటికి స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాలేదట. శ్రీకాంత్ ఫస్ట్ ఆఫ్ వరకే రాసుకున్నాడు. ఈ విషయం మహేష్ కు చెప్పలేదు తీరా షూటింగ్‌కు వెళ్లాక కొంత షూటింగ్ జరిగాక కానీ మహేష్‌కు కథ ఇంకా పూర్తిగా రెడీ కాలేద‌న్న విషయం అర్థం కాలేదట.

శ్రీకాంత్ అడ్డాల ఎలా తీస్తున్నాడు ? అసలు కథ ఎటు పోతుంది ? ఏమిటో కూడా తెలియకుండా గందరగోళం అయిపోయిందట. ఒకరోజు పిలిచి కథ మొత్తం చెప్పమని అడిగాడట మహేష్. అప్పుడు శ్రీకాంత్ కథ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు సార్ అని చెప్పడంతో మహేష్ సెట్ లోని శ్రీకాంత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు స్క్రిప్టు నేలకు విసిరి కొట్టాడట. మహేష్ కోపంలో నిజంగా అర్థం ఉంద‌నే చెప్పాలి.

ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాలేదు అంటే.. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరికాస్త టైం ఇచ్చి ఉండేవాడు.. కానీ శ్రీకాంత్ అడ్డాల మహేష్ తనకు రెండో ఛాన్స్ ఇచ్చాడు అన్న ఆనందంతో కథ పూర్తిగా రెడీ కాని విషయాన్ని దాచిపెట్టి షూటింగ్ కి వెళ్ళిపోయాడు. అలా బ్రహ్మోత్సవం సరైన ప్లానింగ్ లేకుండా సెట్స్ మీదకు వెళ్లి డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందన్న విషయం మహేష్ కి ముందుగానే అర్థం అయిపోయిందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news