Moviesరాజమౌళి తరువాత అలాంటి ఘనత సాధించిన.. ఏకైక మొనగాడు మన అనిల్...

రాజమౌళి తరువాత అలాంటి ఘనత సాధించిన.. ఏకైక మొనగాడు మన అనిల్ రావిపూడినే..శభాష్..!!

ఇది నిజంగా అనిల్ రావిపూడి అభిమానులకు ఎగిరి గంత్తేసే న్యూస్ అని చెప్పాలి . రీసెంట్గా బాలయ్యతో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి .. ఈ సినిమా ద్వారా హ్యూజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడే అరుదైన ఘనతను అందుకున్నాడు అనిల్ రావిపూడి . ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్లోకి చేరిన సెకండ్ డైరెక్టర్ గా తెలుగులో అనిల్ రావిపూడి క్రేజీ రికార్డును నెలకొల్పాడు.

ఇప్పటివరకు ఏడు సినిమాలు తీయగా ఏడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాగా అనిల్ రావిపూడి లాస్ట్ మూడు సినిమాలు ఎఫ్2 – ఎఫ్3 – సరిలేరు నీకెవ్వరు 100 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి . ఇప్పుడు భగవంత్ కేసరి కూడా ఆ కేటగిరీలోకి వచ్చేయడంతో వరుసగా నాలుగు సార్లు 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు .

ఈ దర్శకుడు పేరు ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. అంతకు ముందు ఈ రికార్డు రాజమౌళి దక్కించుకొని టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో అనిల్ రావిపూడి చేరిపోయారు. ఇది నిజంగా అనిల్ కు చాలా బూస్టప్ ఇచ్చే విషయమనే చెప్పాలి. చూద్దాం నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news