Moviesప్చ్:కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి తప్పు చేసిన మహేశ్ బాబు...

ప్చ్:కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి తప్పు చేసిన మహేశ్ బాబు .. ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారే..!?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సినిమాల విషయంలో చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కథ మాకు నచ్చలేదు అని అనిపిస్తే డైరెక్ట్ గానే డైరెక్టర్స్ కి చెప్పేస్తున్నారు. అంతేకాదు హిట్ ట్రాక్ లేని డైరెక్టర్స్ కు ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం లేదు . ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా స్టార్ హీరోలుగా కమిట్ అయిన అందరి హీరోలు హిట్ డైరెక్టర్లతోనే సినిమాకి కమిట్ అవుతున్నారు తప్పిస్తే ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్ తో ఒక్కరు కూడా కమిట్ అవ్వలేదు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు వద్దకు వచ్చిన భారీ ఆఫర్ ని సైతం డైరెక్టర్ కారణంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ గుంటూరు కారం సినిమా షూట్ లో బిజీగా ఉన్న మహేష్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించాలని వరుస ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకున్న మెహర్ రమేష్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . రీసెంట్గా ఓ మంచి కథతో ఆయన వద్దకు వెళ్లారట. కథ నచ్చిన కానీ మహేష్ బాబు మెహర్ రమేష్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి భయపడిపోయి రిజెక్ట్ చేశారట.

అసలే రాజమౌళితో సినిమాలో నటించిన తర్వాత ఏ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుందనే బ్యాట్ సెంటిమెంట్ ఉంది .. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా ద్వారా మరింత స్థాయిలో తన కెరియర్ నాశనం అయిపోతుంది అని ఆయన కథ నచ్చినా మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే కొందరు మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం పై నెగిటివ్గా స్పందిస్తున్నారు . ట్రాక్ రికార్డు ఇంపార్టెంట్ కాదు కధ ఇంపార్టెంట్ ఛాన్స్ ఇవ్వచ్చుగా అంటూ సజెస్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం వద్దు బాబోయ్ వద్దు ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వద్దు కెరియర్ రిస్క్ లో పెట్టొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news