టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. మహేష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ లో ఉన్నాయి.. ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.. అలాగే డిజాస్టర్లు కూడా ఉన్నాయి.
అయితే మహేష్ ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అలాంటి సినిమాల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సైనికుడు – శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన బ్రహ్మోత్సవం. మరుగదాస్‌ను నమ్మి చేసిన స్పైడర్ – సురేందర్ రెడ్డిని గుడ్డిగా నమ్మి చేసిన అతిధి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
ఇక 2007 చివర్లో మహేష్ బాబు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో అతిథి సినిమా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని మహేష్ ఆశలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి టేకింగ్ ను గుడ్డిగా నమ్మేశాడు. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మహేష్ మూడున్నర సంవత్సరాల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయాడు.
ఎంతో మంది డైరెక్టర్లు మహేష్ తో సినిమాలు చేసేందుకు ఎన్నో మంచి కథలు తీసుకు వెళ్లినా కూడా మహేష్ అసలు సినిమాలపై పూర్తి విరక్తితో ఉన్నారు. అసలు ఏ కథను కూడా ఓకే చేయలేదు. మూడున్నర సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖలేజా సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా కూడా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా సూపర్ హిట్ అయ్యాక మహేష్ కాస్త ఫామ్ లోకి వచ్చాడు. అక్కడి నుంచి వరుసహిట్లు పడ్డాయి.