Moviesప్రభాస్ బర్త డే నాడు రోజా చేసిన పనికి షాక్ అవుతున్న...

ప్రభాస్ బర్త డే నాడు రోజా చేసిన పనికి షాక్ అవుతున్న రెబల్ ఫ్యాన్స్.. డార్లింగ్ అంటే అంత పిచ్చా..!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ నేడు తన 44వ పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు , ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు , ఫాన్స్ అందరు ప్రభాస్ కి భారీ స్థాయిలో బర్త డే విషెస్ ను అందజేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా సెల్వమణి సైతం ప్రభాస్ కు వెరైటీగా విషెస్ అందజేసింది . జనరల్ గా రోజా ఏ స్టార్ హీరోలకి ఇలా విషెస్ అందజేయదు . తనకు ఎంతో నచ్చిన హీరోలు తప్పిస్తే మిగతా హీరోలు పుట్టినరోజులను ఆమె పట్టించుకోరు . అయితే ప్రభాస్ అంటే మొదటి నుంచి చాలా చాలా ఇష్టం ఉన్న ఫైర్ బ్రాండ్ పొలిటిషియన్ ఏపీ మంత్రి రోజా ప్రభాస్ పుట్టినరోజుకు ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ విష్ చేసింది .

“ప్రియమైన ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. మీ కలలు అన్ని సహకారం కావాలని కోరుకుంటున్నాను “అంటూ రాసుకొచ్చింది. దీంతో రోజా బర్త్డ డే విషెస్ వైరల్ గా మారాయి . అంతేకాదు చాలామంది యంగ్ హీరోస్ ఈ మధ్యకాలంలో బర్త్డ డే సెలబ్రేట్ చేసుకున్నారు . వాళ్ళు ఎవ్వరికీ దక్కని అరుదైన క్రెడిట్ ప్రభాస్ కే దక్కింది. దీంతో ప్రభాస్ అంటే రోజాకు అంత ఇష్టమా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . ప్రభాస్ గారు అంటూ మెన్షన్ చేయడం కూడా ఇక్కడ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news